మహిళలకు గుర్తింపు.. అన్నింటా రాణింపు 

* మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి  వనిత 

మహిళా సాధికారతే ధ్యేయంగా మహిళలను ప్రోత్సహించి, వారి సంక్షేమానికి ప్రభుత్వ కట్టుబడి ఉందని  రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి  తానేటి వనిత అన్నారు.
గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోరాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం  జరిగింది.  ,ఐసీడీఎస్ ఛాంపియన్లకు   సత్కారం జరిగింది.  కార్యక్రమానికి మంత్రి తానేటీ వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  మంత్రి మాట్లాడుతూ  అందరి సంతోషాలకు ముఖ్యమంత్రి కారకులు అని, అధికారంలోకి వచ్చిన సంవత్సన్నర కాలంలోనే అందరికీ పదోన్నతులు కల్పించా రన్నారు.  ఏటా   రూ. 18వందల కోట్ల నిధులను తమ  శాఖకు ఖర్చు చేస్తున్నామని మంత్రి అన్నారు.గత ప్రభుత్వ కాలంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా అరకొర సేవలు అందించి శాఖకు కేవలం రూ.  500 కోట్లు నిధులు మాత్రమే విడుదల చేసే వారన్నారు. గర్భిణీ స్త్రీలు,బాలింతలకు నాణ్యతతో కూడిన పౌష్టకాహారం అందిస్తున్నామన్నారు. వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ, ట్రైబల్ ఏరియాలలో సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలలో బాగంగా అంగన్వాడి కేంద్రాల ద్వారా అదనపు పౌ్టికాహారాన్ని ఇంటింటికి అందిస్తున్నామన్నారు.  మహిళలు ఎవరిపైన ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయూత పథకం ద్వారా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుకొని మహిళలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. రాజకీయాల్లో కూడా మహిళలకు సముచిత స్థానం కల్పించి అన్ని నామినేటెడ్ పదవులలో 50శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఉద్యోగినులకు, టీనేజ్ యువతకు అండగా భద్రత, రక్షణ కల్పించటం కోసం దిశ చట్టం చేశామని అన్నారు. 

 పిల్లలు విద్యావంతులు అయితే సమాజం బాగుంటుందని ముఖ్యమంత్రి తలంచి  అమ్మ ఒడి పదకాన్ని అమలు చేస్తూ తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామన్నారు. నాడు- నేడు కార్యక్రమంలో అంగన్వాడి భవనాలకు మౌళిక సదుపాయాలు కల్పించి వాటి రూపు రేఖలు మారుస్తున్నామన్నారు.కరోనా వైరస్ కష్ట కాలంలో గర్భవతులు,బాలింతలకు చక్కని సేవలు అందించారని మంత్రి అబినందించారు.తమ శాఖలోని అన్ని స్థాయి ఉద్యోగులకు పదోన్నతలు కల్పిస్తున్నామని, రీజనల్ జాయింట్ డైరెక్టర్,ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి ఉన్నతస్థాయి పోస్టులలో మహిళలు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.అందరి కళ్లల్లో సంతోషాన్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని,ఉద్యోగులు మరిన్ని సేవలు అందించి, నిబద్ధతతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి తానేటి వనిత ఆకాక్షించారు. అవార్డులు అందుకున్నవారికి  మంత్రి తానేటి వనిత ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వైరస్ కష్ట కాలంలో విశేష సేవలు అందించిన 39మంది అంగన్వాడీ వర్కర్లకు ఛాంపియన్ ఆఫ్ ఐసీడీఎస్ సర్టిఫికెట్స్, రివార్డులను మంత్రి . అందించారు. వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ మొబైల్ అప్లికేషన్ యాప్,పోస్టర్స్, బుక్ లెట్ లను మంత్రి ఆవిష్కరించారు. గ్రేడ్ -2 నుండి గ్రేడ్ -1 కు పదోన్నతి పొందిన 316మందికి ప్రమోషన్ ఆర్డర్స్ మంత్రి చేతుల మీదుగా అందచేశారు. అంగన్వాడీ వర్కర్లు కు శానిటైజెర్, యూనిఫాం,మెడికల్ కిట్ అందజేశారు. మహిళాభివృధి, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ ఆర్ అనూరాధ, డైరెక్టర్ కృతికా శుక్లా, ఆశాఖ ఆర్జేడీ లు, ప్రాజెక్టు డైరెక్టర్లు,అంగన్వాడి టీచర్లు, సిడి పి,వో లు సూపరవైజర్ లు తదితరులు ఉన్నారు.