ఎన్నికల షెడ్యూలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
(ఉద్యోగులు న్యూస్)
స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూలు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ఆక్షేపించారు. రాష్ట్రంలో కరోన ఎలా నియంత్రణ లోనికి వచ్చింది అనేది ఎన్నికల సంఘం తెలుసుకోవాలన్నారు.ఉద్యోగులు కరోన సమయంలో పనిచేసినందునే నియంత్రణ లోకి వచ్చిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్, బ్రిటన్ స్ట్రైన్ వస్తుంది అని చెపుతున్నారు.
ఎన్నికల విషయంలో ఎస్ఈసి వ్యక్తిగత ప్రతిష్టకు పోకూడదన్నారు.
ఉద్యోగులు ఎన్నికల విధులకు మానసికంగా సిద్ధంగా లేరని ఎన్నికల సంఘం ఏకపక్ష విధానం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ని దృష్టి లో పెట్టుకోవాలన్నారు. వాక్సినేషన్ పూర్తి అయ్యాక ఎన్నికలు నిర్వహించాలన్నారు. కనీసం ఫ్రంట్ లైన్ వారియోర్స్ కు వాక్సినేషన్ వేశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.