ఎన్నికల షెడ్యుల్ ఉపసంహరించు కోవాలి
* ఎంజీవో సంఘం నేత డిమాండ్
(ఉద్యోగులు న్యూస్)
ఆంధ్రప్రదేశ్ లో బలవంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే వాటిని ఉద్యోగులు బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం హెచ్చరించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గుంటూరులో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెళితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వాయిదా వేయాలని రెండు నెలలుగా తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగులు ఉలిక్కి పడ్డారు అన్నారు. ఇప్పటికే కరోనాతో చాలామంది ఉద్యోగులు చనిపోయారు అన్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ సత్వరం ఉపసంహరించుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులు, ప్రజలకు కరోనా సోకిందని వివరించారు.
కరోనా తగ్గాక ఎన్నికలు నిర్వహించాలని పదే పదే కమిషన్ ను కోరుతున్నామని చెప్పారు.
ఉద్యోగుల ప్రాణాలు కూడా ముఖ్యమే
రాష్ట్ర ఉద్యోగుల ప్రాణాలు కూడా ముఖ్యమేనని, ఎన్నికల కమిషన్ మొండిగా ముందుకు వెళితే తాము ఎన్నిక లు బహిష్కరిస్తామని ఎన్జీవో నేత తేల్చి చెప్పారు.
సీపీఎస్ రద్దుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అన్నారు. 27 శాతం మధ్యంతర భృతిని గతంలో ప్రభుత్వం ఇచ్చింద నీ, కరోనా కారణంగా ప్రభుత్వం
పీఆర్సీ అమలు చేయలేకపోయిందని చెప్పారు. త్వరలోనే పీఆర్సీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగులకు రావలసిన రాయితీలు సాధించుకుంటాం అన్నారు.