మంత్రికి   గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వినతి 

ఉద్యోగులు  న్యూస్
 

 గ్రామ-వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళా పోలీసుల డ్రెస్ కోడ్ విషయంపై తుది నిర్ణయం తీసుకునే ముందు, తమ అభిప్రాయాలను తీసుకోవాలని వారు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి  మేకతోటి సుచరితని కోరారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యలను మంత్రికి వివరించారు.  ప్రభుత్వం  దృష్టికి తీసుకొని వెళ్లాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (ఏపీవిడబ్ల్యూ ఎస్ ఈఏ   361/2020 ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ కోరారు.   రాష్ట్రంలోని వివిధ మునిసిపాలిటీల్లో/కార్పొరేషన్లలో పనిచేస్తున్న వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శుల  సమస్యలను పరిష్కరించాలని అడిగారు.