Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

కాంట్రాక్టు పారా మేడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి 

ఉద్యోగులు  న్యూస్
 


జాతీయ స్థాయిలో ఏపిని మొదటి స్ధానంలో నిలిపిన వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే న్యాయం చేయాలని , ఎన్నికల మేనిఫేస్టో హమీ మేరకు కాంట్రాక్టు పారా మేడికల్ ఉద్యోగులను జాప్యం చేయకుండా రెగ్యులరైజ్ చేయాలనీ వారు కోరారు. తమ కనీస కోర్కెను  ముఖ్యమంత్రికి వినిపించాలని ఏమ్మల్సీ జకియా ఖానమ్ కు విజ్ఞప్తి చేసారు .   ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా  డియస్సి ద్వారా ప్రభుత్వ అన్ని నియమాలను, నిబంధనలకు లోబడి శాంక్షన్డ్ పోస్టుల్లో నియామమితులయ్యామని తెలిపారు.   క్రమబద్ధీకరణకు అన్ని అర్హతలతో ఎదురుచూస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఆవేదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినిపించాలని  రాయచోటి పట్టణంలో ఏమ్మేల్సీ జకియా ఖానమ్ ని స్వగృహంలో కలసి నివేదించారు.  ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఎంప్లాయిస్ జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి,జిల్లా కన్వీనర్ యస్.ఖాదర్ భాష,జిల్లా నాయకులు యం.సుదర్శన్ రాజు,యస్.ఖదీర్,కె.రామయ్య,యం.మురళిమోహన్,డి.రామచంద్ర తదితరులు వినపత్రం సమర్పించారు. 

 వైద్య ఆరోగ్య రంగంలో  కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రంట్ లైన్ వారియర్స్ గా నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూనే ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్నామని తెలిపారు. గత 20 సంవత్సరలగా ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రాత  మారలేదన్నారు. వైయస్సార్ సిపి  మేనిఫేస్టో 2019 లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు.   ప్రభుత్వం  అప్పటికపుడు  కొత్త సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని,  20 నెలలు దాటినా రెగ్యులర్ కాకపోగా ,కాంట్రాక్టు ఉద్యోగులు అర్దాంతరంగా మరణిస్తూన్నారని, చాలా మంది మార్చి, జూన్ మాసాల్లో ఉద్యోగవిరణ పొందారని వివరించారు. , అందరికి కూడా 50,55 సంవత్సరాల వయస్సు దాటిన వారే ఉన్నారని తెలిపారు. కావున ఏ మాత్రం జాప్యం జరగకుండా త్వరగా మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక తెప్పించుకోని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మా బ్రతకులుకు వెలుగునివ్వలనికోరారు.ఎమ్మెల్సీ  స్పందించి ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని కాంట్రాక్టు ఉద్యోగులకు తెలిపారు.