ఉద్యోగసంఘాలతో చర్చించాలి
 

* పీఆర్ సీ తదితరాల పై...
* సీఎం కు ఏపీ అమరావతి జేఏసీ వినతి

ముఖ్యమంత్రికి ఉద్యోగుల సమస్యలను ఏపీ జేఏసీ నివేదించింది. పిఆర్సీ అమలుకు చొరవ తీసుకోమని  కోరింది.  రెవెన్యూ డైరీ ఆవిష్కరించిన సందర్భంలో ఏపీ జేఏసీ నేతలు   బొప్పరాజు, వైవీ రావు ముఖ్యమంత్రికి  ఉద్యోగుల ఆకాంక్షలను  వివరించారు.  ఆయన సానుకూలంగా స్పందించారు.  పీఆర్సీ  నివేదిక తెప్పించుకొని వెంటనే అమలుచేయాలని కోరింది.  ఉద్యోగులకు లేని ఈహెచ్ ఎస్  కార్డ్ లు అంతగా   ఉపయోగకరంగా లేవని విషయం సీఎం దృష్టిలో ఉంచారు.  ఉద్యోగసంఘాలతో సమీక్ష జరపాలని బొప్పరాజు కోరారు. .

ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ లో ఈ  పధకం క్రింద అమలు అయ్యేటట్లు చూడాలని కోరారు.   కరోనా బారిన పడిన ఉద్యోగస్తులు వారి కుటుంబసభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్ నందు వైద్య సౌకర్యం అందించాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో  వైద్యం చేయించుకున్న వారికి రియంబర్స్ మెంట్ సౌకర్యం కల్పించామని అడిగారు. టీచర్లతో సమానంగా  మహిళా ఉద్యోగినులకు కూడా 5 రోజుల ప్రత్యేక సెలవులు , మహిళ ఉద్యోగినలకు ఇచ్చే180 రోజుల ప్రసూతి సెలవులను ప్రొబేషన్ డిక్లరేషన్ కు కలపడం,  హోంగార్డు లకు యూనిఫార్మేడ్ సర్వీస్ శాఖలలో క్లాస్-సి&డి ఉద్యోగాలలో కోటా ఇవ్వాలని,  కాంట్రాక్టు ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాల కు పెంచాలని,  తదితర ప్రధాన సమస్యలన్నిటినీ సీఎంకు చెప్పుకున్నారు  ఏపీ జేఏసీ అమరావతి నాయకులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలని తన  అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఆదేశించారు.  ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు  తెలిపారు. 
ఏపీ జేఏసీ  అమరావతి సెక్రటరీ జనరల్ వై వి రావు , కో ఛైర్మన్స్ జి వి నారాయణరెడ్డి ,  ఐ. విజయకుమార్ , జి. కేశవనాయుడు, జనకుల శ్రీనివాసరావు, కె సంగీతరావు,  మహిళా విభాగం కార్యదర్శి  మెహరాజ్ సుల్తానా పాల్గొన్నారు.