Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

దీక్షా దక్షత......

కలెక్టరేట్ల ముందు ఫ్యాప్టో నిరసన

బదిలీలు, పదోన్నతులు, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముందు చేస్తున్న ధర్నా శుక్రవారం కొనసాగింది. ఉపాధ్యాయులు ఈ దీక్షల్లో పాల్గొని తమ డిమాండ్లను నినదించారు. ప్రాధమిక పాఠశాలల పరిరక్షణకే హేతుబద్ధీకరణ జరగాలని కోరారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా శిబిరానికి ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు. చైర్మన్ రఘు బాబు మాట్లాడుతూ 1;20 ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలని పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు పోస్టులు కేటాయించాలని సూచించారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు పి వి సుబ్బారావు , జాల రామయ్య, మాట్లాడుతూ వంద శాతం ఖాళీలను ప్రకటించాలన్నారు. ఫ్యాప్టో నేతలు విజయసారథి రామరెడ్డి, సిహెచ్ కుమారి, నూర్ అహ్మద్, సెక్రటరీ జనరల్ కే జి బి కీర్తి తదితరులు పాల్గొన్నారు.

 

కలక్టరేట్లు  ముందు జరిగిన రిలేనిరాహారదీక్షలో 5 వరోజున ఫెడరేషన్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. శిబిరంలో ఫెడరేషన్ తరపున రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.కె.ఆరిఫ్ హుస్సేన్, జిల్లా అకడమిక్ కమిటీ సభ్యులు బి.వెంకటేశ్వర్లు దీక్ష లో కూర్చొన్నారు.వారికి మద్దతుగా ఫెడరేషన్ తరపున రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజీవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్.వి.కృష్ణారెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్.శివరామిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పిచ్చిబాబు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వై.జనార్థనరావు,జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె.సుభాన్, ఎం.సులోచనమ్మ,జిల్లా కార్యదర్శి సుంకు వెంకటేశ్వర్లు,రాష్ట్ర కౌన్సిలర్లు వై.వెంకటేశ్వర్లు, ఎం.శీనయ్య,ఎ.రాధాకృష్ణ సైదాపురం నుండి సిహెచ్ హరికృష్ణ, రాపూరు నుండి భార్గవ్, కలువాయి అధ్యక్షులు ఎన్ నాగరాజు,మనుబోలు అధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, వెంకటాచలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.పెంచలయ్య,ఆర్.సుధాకర్ గార్లు,నెల్లూరు అధ్యక్షులు ఎన్.మురళీకృష్ణ, ఇందుకూరుపేట ప్రధానకార్యదర్శి పి.శ్రీనివాసులు ముత్తుకూరు నుండి పి.రామచంద్రయ్య,సిహెచ్.శ్రీనివాసులురెడ్డి,ఎం ప్రసాద్,టిపి గూడూరు నుండి సిహెచ్.శ్రీధర్,ఎం.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరంలో ..

విజయనగరం జిల్లాలో జరిగిన దీక్షలకు నుంచి మంచి స్పందన లభించింది. నిరాహార దీక్షల్లో ఫ్యాప్టో నాయకులు ఈశ్వరరావు, వెంకటనాయుడు, సత్యనారాయణ, రాజశేఖరం, గౌరీ శంకర్ రావు, అప్పలరాజు , సూర్యప్రకాష్. శ్రీనివాస రావు రమేష్ నాయుడు , తదితరులు పాల్గొన్నారు

ఎపిటిఎఫ్ గుంటూరు

ఎపిటిఎఫ్ గుంటూరు రూరల్ మండల అధ్యక్షులు వై. శివ పార్వతి గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు .  ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ 19 38 జిల్లా అధ్యక్షులు జి.వేలాంగిని రాజు అధ్యక్షత వహించారు.

ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులకు ,ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల నాయకులకు, ఏపీటీఎఫ్  జిల్లా గౌరవ అధ్యక్షులు యం దేవదానబాబు, ఉపాధ్యక్షులు వై నాగమల్లేశ్వరరావు, పి రమేష్ కుమార్ ,అదనపు కార్యదర్శి ఏం సాయన్న ,జిల్లా కార్యదర్శి లక్ష్మీ గణేష్, నగర గౌరవ అధ్యక్షులు కైలాష్ నాథ్ ,నగర అధ్యక్షుడు డి. సురేష్ ,నగర ప్రధాన కార్యదర్శి ఎ.జోజప్ప నగర నాయకులు భాస్కర్ రావు , నాదెండ్ల మండల బాధ్యులు ఎం. వినీల ,కె.నాగ మహేష్  ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు ఎ.వి రామారావు ఎమ్. వి. ప్రసాద్, సూర్య ప్రకాష్, గార్లు మరియు జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ఏపిటిఎఫ్ కార్యకర్తలందరికీ ఉద్యమ అభినందనలు తెలియచేసారు .

నెల్లూరు జిల్లాలో

అనంతపురం జిల్లా

ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐదో రోజు  రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఏపిటిఎఫ్ 1938 నాయకులు, కార్యకర్తలు

ఎక్కువ మందిచదివినవి