Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

కేంద్ర ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ వరాలు...

పండగ అడ్వాన్సు, ఎల్ టీ సీ ఓచర్లు...

రాష్ర్ట ప్రభుత్వాలకు చురుకు పుట్టదా...

తెలుగు రాష్ష్ర్టాల ఉద్యోగుల్లో చర్చ

 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన వరాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇవి పూర్తి గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేవి అయినా  రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆసక్తికరమై చర్చ జరుగుతోంది.  పండగ అడ్వాన్సు కింద ప్రతి ఉద్యోగికి రూ.10వేలు ఇస్తారు. ఎల్ టీ సీ మొత్తాన్ని నగదు ఓచర్లుగా ఇస్తారు.  ఈ మొత్తాలను కొన్ని నిబంధనల మేరకు వచ్చే ఏడాది మార్చి 31 లోపు మార్కెట్ లో వస్తువుల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటంది.

 ప్రస్తుత కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థను ఉత్సాహపరిచేందుకు వీలుగా ఆర్థిక మంత్రి కేంద్ర ఉద్యోగులకు కొన్ని వరాలు ప్రకటించారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచి  మార్కెట్టులో నిధుల ప్రవాహం పెంచడం ద్వారా  మాత్రమే ఉత్పత్తి పెంపునకు, ఉద్యోగిత తగ్గిపోకుండా చూసుకోవడానికి మార్గమనే ఉద్దేశంతో వీటి ప్రకటన వెలువడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వరాలు ప్రకటించారు.  దసరా, దీపావళి వస్తున్న నేపథ్యంలో పండగ అడ్వాన్సులు ప్రతి ఉద్యోగికి ఇస్తామన్నారు.మరో వైపు ఎల్ టీసీ ఓచర్లు ఇస్తామని వెల్లడించారు. ప్రస్తతు కరోనా సీజన్లో దూర ప్రాంతాలకు ప్రయాణానికి ఉద్యోగులు ఆసకిత చూపకపోవడంతో ఆ మొత్తాన్ని ఓచర్ల రూపంలో ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆ  ఓచర్లతో ఆహార వస్తువులు కాకుండా ఏమైనా కొనుగోలు చేయవచ్చని  కేంద్రం  నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి  31 వరకు ఈ ఓచర్లు వినియోగించుకునే అవకాశం కల్పించింది.

ఎల్ టీ  సీ ఓచర్లపై పరిమితులు...

ఈ ఎల్ టీ సీ ఓచర్ల   వినియోగానికి కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది. ఉద్యోగులు ఈ  ఓచర్లు వినియోగించుకునేందుకు కొనే వస్తువులు  జీఎస్టీ విలువ 12శాతం కన్నా ఎక్కువ  ఉండాలి. వాటి ఆధారమూ సమర్పించాల్సి ఉంటుంది.  వీటిని డిజిటల్ ఆదారిత విధానంలోనే  కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

10 నెలల్లో తిరిగి వెనక్కు...

పండగ అడ్వాన్సులను పది నెలల్లో తిరిగి వెనక్కు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ.1000 చొప్పున జీతంలో మినహాయించుకుంటారు.

రాష్ర్టాల్లో  ఏమిటి?

రెండు తెలుగు రాష్ర్టాల్లోను దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో డీఏలు పెండింగులో ఉన్నాయి. కరోనా పెండింగు జీతాల చెల్లింపులపై ఏపీలో  జీవో రావలసి ఉంది. దసరాకు రెండు డీఏ లైనా ప్రకటించాలని ఉద్యోగులు ఎదురుచూస్తుండగా ఆ ముహూర్తం ఎప్పుడు అనేది అధికారికి ప్రకటన ఇంకా రాలేదు. తెలంగాణలో దసరా పెద్ద పండగ. బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి.  పండగకు డీఏలు ప్రకటించాలని అక్కడి ఉద్యోగ సంఘాలు కోరినా ఇప్పటికీ నిర్ణయాలు వెలువడలేదు.  కేంద్రం ప్రకటన రాష్ర్ట ప్రభుత్వాలపై ప్రభావం చూపాలని ఇక్కడి ఉద్యోగులు ఆశిస్తున్నారు. దసరాకు  ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ప్రకటనలు రావాలని కోరుకుంటున్నారు.

ఎక్కువ మందిచదివినవి