కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  దసరా బోనస్

ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా  బోనస్ ఇవ్వనున్నట్లు  కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. దీనికి సంభందించిన ఫైల్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. బోనస్ కోసం రూ 3737  కోట్లను  విడుదల చేయనున్నారు . ఈ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు  పండగ బోనస్ అందుకోనున్నారు . ఒకే వాయిదా లో దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.