Thursday 29th October 2020
ముఖ్యాంశాలు
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • మాటిచ్చారు సరే ...రాసిద్దురూ!....సేవలు, సవాళ్ళలో నిత్యం పోరాటయోధులమే....విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టు
  • సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే....డబ్బులు వసూలు చేస్తే 10 పెనాల్టీ.....డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
  • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు.....రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ముఖ్యమంత్రి చెంతకు ఉపాధ్యాయుల సమస్యలు.........సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా..
  • కలిసి కదులుదాం.. వృత్తిలో ఎదుగుదాం...........ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్
  • ఉపాధ్యాయుల సమ్మతితో విలీనం జరగాలి...ఏపీటీఎఫ్ 1938
  • ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్లకు జీతాలు మంజూరు

నవంబరు 26న సార్వత్రిక సమ్మె

*కేంద్ర కార్మిక సంఘాల నిర్ణయం

 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నవంబరు 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని పది కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ అసోసియేషన్లు, స్వతంత్ర సంస్థల జాతీయ సదస్సు శుక్రవారం ఆన్ లైన్ లో నిర్వహించి  ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఎన్ టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి నేతృత్వంలో ఈ సదస్సు జరిగింది. సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఏఐయుటీయూసీ, టీయూసీసీ, ఎల్ పీఎఫ్, యూటీయూసీ తదితర సంఘాల ప్రతినిధులు సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పె ట్టిందని, విదేశీ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగాన్ని అప్పగించేస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు. నవంబరు మధ్య వరకు లేబర్ కోడ్స్ ప్రభావాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని  నిర్ణయించాయి. వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్న కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేశాయి. రైల్వే, పోర్టులు వంటి ప్రభుత్వ సంస్థల కార్పొరేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి.