Thursday 29th October 2020
ముఖ్యాంశాలు
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • మాటిచ్చారు సరే ...రాసిద్దురూ!....సేవలు, సవాళ్ళలో నిత్యం పోరాటయోధులమే....విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టు
  • సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే....డబ్బులు వసూలు చేస్తే 10 పెనాల్టీ.....డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
  • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు.....రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ముఖ్యమంత్రి చెంతకు ఉపాధ్యాయుల సమస్యలు.........సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా..
  • కలిసి కదులుదాం.. వృత్తిలో ఎదుగుదాం...........ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్
  • ఉపాధ్యాయుల సమ్మతితో విలీనం జరగాలి...ఏపీటీఎఫ్ 1938
  • ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్లకు జీతాలు మంజూరు

ఆరోగ్య మిత్రలకు వేతనాలు పెంచేలా చూడాలి

*వెంకట్రామిరెడ్డికి  కాంట్రాక్టు , పొరుగుసేవల సిబ్బంది వినతి

 

ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్య మిత్ర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు ఉద్యోగులు వేతనాలు పెంపు, క్యాడర్ అంశాల పరిష్కారం కోరుకుంటున్నారు. ఈ మేరకు  ఏపీ గవర్నమెంట్ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం కొందరిని తొలగించిందని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగరాజు ,రాష్ట్ర కార్యదర్శి శేఖర్ రాష్ట్ర కార్యదర్శి కేసన్న తదితరులు వారి సమస్యలను వెంకట్రామిరెడ్డికి వివరించారు.