Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

యూనిట్లు, క్వార్ట్రర్లీలు రాయడం కుదరదు 

*మెరుగైన వైద్యం అందించే వసతులు, శిక్షణ ఇవ్వండి!

*పీహెచ్సీ వైద్యాధికారుల డిమాండ్

 

తూర్పు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు తమ సామర్ధ్యానికి పరీక్ష పెట్టాలనే అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పరీక్షల కన్నా పనితీరును మెరుగు పరచుకొనే శిక్షణలు , ఆధునిక సాంకేతిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసారు. రెవిన్యూ ఇతర శాఖల్లో ఇలా పనితీరు కొలిచే పరీక్షలు ఏటా నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ (ఎన్‌హెచ్‌పి), ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ల మెడికల్ ఆఫీసర్ల ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సామర్థ్యాలను నిర్ధారించడానికి పరీక్షను నిర్వహించాలన్న ప్రతిపాదనపై విస్మయం చెందుతున్నామని తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు అన్నారు.

ఇండక్షన్ శిక్షణలో భాగంగా తామంతా ఇప్పటికే పైన పేర్కొన్న పరీక్షలు రాశామని, తాము పిహెచ్‌సి ఎంఓగా చేరినప్పటినుంచి ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సామర్థ్యాలపై ఇంకా నమ్మకం లేకపోతే నచ్చిన వైద్యుని వద్దకు వచ్చి వైద్యం చేయించుకోవాలని సూచించారు . పని సామర్థ్యాలను పెంపొందించడానికి పరీక్షలు నిర్వహించడానికి బదులు వృత్తి నైపుణ్యాలను నవీకరించుకొనే ఒక శిక్షణా కార్యక్రమం ఇవ్వాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనే తపన, వైద్యానికి వచ్చినవారు సంతృప్తి పడేలా సేవలు తమకు నిత్య పరీక్ష అని స్పష్టం చేశారు. .పనితీరు, సామర్ధ్య పరీక్ష ప్రత్యేకంగా పనిచేసే ఉద్యోగుల కోసం నిర్వహిస్తుంటే మిగిలిన అన్ని శాఖల్లో ఈ ప్రయత్నం జరిగిందా అని ప్రశ్నించారు. వైద్యాధికారులను తక్కువగా చూసే ధోరణి తప్ప పరీక్ష లక్ష్యం మరొకటి లేదన్నారు .రెవెన్యూ, విద్యుత్, విద్య, ఇలా ప్రభుత్వంలో ఎన్ని ఇతర విభాగాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. తాము పరీక్షకు హాజరవ్వమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టం చేసారు.

ఎక్కువ మందిచదివినవి