Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ ప్రభుత్వమే నిర్వహించాలి

*జిల్లా కమిటీల్లో మా సంఘానికీ ప్రాతినిధ్యం ఇవ్వాలి

*కె.ఆర్.సూర్యనారాయణ, ఆస్కారరావుల డిమాండ్

(ఉద్యోగులు న్యూస్)

ప్రభుత్వ ఉద్యోగులకు ఇక ప్రతి ఏడాది ఒకసారి హెల్త్ చెకప్ లు  ప్రభుత్వమే నిర్వహించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కారరావులు కోరారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో బుధవారం రాత్రి ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వీరు పాల్గొని  ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. డిజిటల్ కార్డులు  వేగవంతంగా జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యానికి  నెట్ వర్కు ఆస్పత్రులు నిరాకరిస్తున్నందున  రీయింబర్స్ మెంటు సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా స్థాయి కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో  రెండు నెలలకోసారి సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీలోకి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను  తీసుకోవాలని సూర్యనారాయణ, ఆస్కారరావులు కోరారు. నెట్ వర్కు ఆస్పత్రుల్లో ఉద్యోగులకు  ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఎక్కువ మందిచదివినవి