Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

విద్యుత్ ఉద్యోగుల దేశవ్యాప్త ధర్నాలు

- విద్యుత్ ఐకాస పిలుపు

 భారత దేశ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ జాతీయస్థాయిలో తలపెట్టిన ఆందోళనల్లో పాల్గొనాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి నిర్ణయించింది. శనివారం స్థానిక విద్యుత్ సౌధలో జరిగిన ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ జనరల్ సెక్రటరీ మోహన శర్మ  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 5న జాతీయ స్థాయిలో జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నున్నట్లు ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రకటించారు. అనంతరం ఐక్యకార్యాచరణ సమితి నాయకుడు శివాజీ మాట్లాడుతూకేంద్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టబోయే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధి విధానాలతో ముసాయిదా బిల్లు  నిరసిస్తూ, పేద మధ్య తరగతి ప్రజలు రైతులు ఉద్యోగులు పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని దీన్ని సహించబోమని పేర్కొన్నారు. 5వ తేదీన జాతీయస్థాయిలో జరిగే ఆందోళన జయప్రదం చేయమని కోరారు. ఈ క్రమంలో ఐక్యకార్యాచరణ సమితి నాయకులు శివాజీఅంజయ్యగణేష్మొదలగు వారు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి