Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

విద్యుత్ చట్ట సవరణ వ్యతిరేకించాలి

*  ఎన్టీయూసీ,ఏపీఎస్ఈఈయూ-327-1 సమావేశం డిమాండ్

విజయవాడలోని ఏపీఎస్ఈఈయూ 327 యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హోటల్ ఎస్ఆర్సీ గ్రాండ్ లో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి  ఐఎన్డియూసీ అధ్యక్షులు,327 యూనియన్ అధ్యక్షులు  జి సంజీవరెడ్డి గారు, EX ఎంపీ(రాజ్యసభ) ముఖ్య  అతిథిగా పాల్గొన్నారు.  కేంద్ర విద్యుత్ చట్ట సవరణ 2020 వ్యతిరేకరించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థను  ప్రైవేటీకరణ చేయకుండా వుండాలని, డిఫెన్స్ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని తెలియ జేశారు. 99 ఫిబ్రవరి 1 తర్వాత విద్యుత్ శాఖ లో చేరిన వారికి పెన్షన్ ఇప్పిస్తామని తెలియ జేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని,వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ లైన్మన్ గ్రేడ్-2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు వైద్య సదుపాయము కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ పట్ల ఉద్యోగులు అంకిత భావంతో ఉండాలన్నారు.  ముఖ్యమంత్రితో మాట్లాడి డిమాండ్స్ అన్నీ పరిష్కరిస్తానని అని హామీ ఇచ్చారు.

 

 

ఎక్కువ మందిచదివినవి