Thursday 29th October 2020
ముఖ్యాంశాలు
  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు....రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • మాటిచ్చారు సరే ...రాసిద్దురూ!....సేవలు, సవాళ్ళలో నిత్యం పోరాటయోధులమే....విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టు
  • సంరక్షణ పథకం కింద చికిత్స చేయాల్సిందే....డబ్బులు వసూలు చేస్తే 10 పెనాల్టీ.....డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో
  • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు.....రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
  • ముఖ్యమంత్రి చెంతకు ఉపాధ్యాయుల సమస్యలు.........సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా..
  • కలిసి కదులుదాం.. వృత్తిలో ఎదుగుదాం...........ఏపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వో స్ అసోసియేషన్
  • ఉపాధ్యాయుల సమ్మతితో విలీనం జరగాలి...ఏపీటీఎఫ్ 1938
  • ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్లకు జీతాలు మంజూరు

ఏపీ  విద్యుత్తు ఎంప్లాయిస్ సమ్మెకు నిర్ణయం

*నేడు ఇంధన కార్యదర్శికి నోటీసు

డిస్కంల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది.  తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేయడమే మార్గమని సోమవారం నాటి ఈ సంఘం సమావేశం నిర్ణయించింది. తొమ్మిది డిమాండ్లతో మంగళవారం ఇంధనశాఖ కార్యదర్శికి సమ్మె  నోటీసు ఇవ్వబోతున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. విజయవాడ గుణదలలోని  ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఎంప్లాయిస్ యూనియన్ 1104 కార్యాలయంలో సోమవారం వారు సమావేశమయ్యారు. సోలార్ ప్రాజెక్టులను జెన్ కో కు అప్పచెప్పాలని,  డిస్కంల ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని జేఏసీ తీర్మానించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరింది. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడంలో ఆలస్యం చేస్తున్నారని పేర్కొంది.