Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

ఉద్యోగులకు కెసీఆర్ వరాలు

*వేతనాల పెంపునకు నిర్ణయం

*అధ్యయనానికి కమిటీ

 

(ఉద్యోగులు న్యూస్)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగుల పై వరాలు కురిపించి  ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత కొంత కాలంగా ఉద్యోగులకు.. ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చివరకు టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించటానికి కూడా ప్రభుత్వం  వెనకాడేండింది. ఇలా జరగటం చరిత్రలో ఇదే మొదటిసారి. దుబ్బాక,  జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేఖంగా రావడం  కెసీఆర్ ను ఉద్యోగుల విషయంలో మనసు మార్చుకునేలా చేసింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు తోడు పలు మున్సిపల్ కార్పొరేషన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్నిచెప్పారు . మళ్ళీ కొత్తగా దీని కోసం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు

అన్నిరకాల ఉద్యోగులను  కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు ఉన్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలి' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ఎక్కువ మందిచదివినవి