Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

​​​​​​ హామీలకు స్వాగతం  అమలు తోనే సంతోషం

* టి ఎస్ ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్

( ఉద్యోగులు న్యూస్) 

ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని  ఏపీఎస్ఆర్టీసీ  ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి అన్నారు.  2017జనవరి 1 నుంచి  కార్మికుల వేతన సవరణ చేయాలన్నారు.  
తక్కువ జీతాలు ఉన్నఆర్టీసీ కార్మికులకూ వేతన సవరణ చేస్తామని ప్రకటిస్తూ, ఆ భారాన్ని  ప్రభుత్వ భరిస్తుందనడం సంతోషమన్నారు. . ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్మెంట్ ఆర్టిసి ఉద్యోగులకు కూడా ఇస్తూ 1 సంవత్సరాల కాలపరిమితికి వేతన సవరణ అగ్రిమెంట్ చేయాలని కోరారు. గతంలో ప్రభుత్వాల మాదిరి వ్యవహరించకుండా  ముఖ్యమంత్రి 2015 మే 13న  ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటి వరకు ఉన్న ఆర్టీసి అప్పులను మాఫీ చేయాలని కోరారు.  గ్రేటర్ హైదరాబాద్ మున్నిపల్ కార్పొరేషన్ నుండి సిటీలో వస్తున్న నష్టాలను ఏఏడాదికా ఏటి  క్తీసికి చెల్లించే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.  డీజిల్ పై పెంచిన వ్యాటిను తగ్గించి  ఆర్టీసిని ఆర్థికంగా ఆదుకోవాలని  డిమాండ్ చేశారు. 2019 డిసెంబరు1,  2020 నవంబరు 15న ముఖ్యమంత్రి ఆర్టీసి కార్మికుల ఉద్యోగభద్రతపై ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని కోరారు. పదవీవిరమణ రోజే  ఉద్యోగులకు అన్నివిధాల ఆర్థిక లబ్ది చేకూరాలని ,  చెల్లించాలని ముఖ్యమంత్రి గారు పేర్కోనటాన్ని స్వాగత్తూ 01-1)1-21 సుండి ఆర్టీసిలో ఢిబైలైన కార్మికులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందున తక్షణను ఆస్ట్రీలో రిటైరైన కార్మికులకు సెటిల్‌మెంట్ డబ్బులు చెల్లించాలని మరియు 30-11-2011 నుండి జూన్ 2011 లోనే రిటైరైన కార్మికులకు సకలజనుల సమ్మె వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.  టీఎస్ఆర్డిసిలోకారుణ్య నియామకాలు విషయంలో జాప్యం  చేయకుండా చూడాలని కోరారు.  2013 వేతన సవరణ నాటికీ ఉన్న బకాయిలకు  5 సంవత్సరాల కాలపరిమితితో ఇచ్చిన బాండ్ల సొమ్మును చెల్లించాలన్నారు. యాజమాన్యం సిసిఎస్ కు బాకీ పడిన రూ. 750 కోట్లు చెల్లించాలని  కోరారు

ఎక్కువ మందిచదివినవి