పంచాయతీరాజ్ మినిస్టీరియల్
ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలపై స్టే
*కర్నూలు, కృష్ణా జిల్లా యూనిట్ ల అభ్యర్థనలతో...
(ఉద్యోగులు న్యూస్)
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట హైకోర్టు స్టే విధించింది. గుంటూరు జిల్లా పరిషత్తు ప్రాంగణంలో ఈ ఎన్నికలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి, ఎన్ జీ వో అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 19న నోటిఫికేషన్ ఇవ్వగా అది 25న ప్రచురించారు. దీనిపై అదే యూనియన్ కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లా నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తమ జిల్లా యూనిట్ ఎన్నికలు జరపకుండా రాష్ర్ట యూనియన్ కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ప్రతివాదికి నోటీసు జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రస్తుత రాష్ర్ట అధ్యక్షులు బండి శ్రీనివాసరావును సంప్రదించగా ఒక వేళ స్టే ఉత్తర్వులు వచ్చి ఉంటే తమ న్యాయవాదిని సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.