సంక్రాంతికి పీఆర్సీ ప్రకటించాలి

( ఉద్యోగులు న్యూస్)

 పదకొండో   వేతన సవరణ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి నివేదించి  మూడు నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సంక్రాంతి నాటికి పిఆర్సి ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. పెరిగిన జీవన ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగ ఉపాధ్యాయుల అంతా పిఆర్సి కోసం నిరీక్షిస్తున్నారని ఫ్యాప్టో చైర్మన్ జీవి నారాయణ రెడ్డి,సెక్రటరీ జనరల్ కె నరహరి, కో చైర్మన్లు  ఎస్కే సాబ్జి, రఘునాథ రెడ్డి భానుమూర్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రకాశ్ రావు,కోశాధికారి శౌరిరాయలు,  డిప్యూటీ సెక్రటరీ జనరల్ శరత్ చంద్ర,  ప్రభుత్వ కార్యదర్శి ఒక లేఖ ద్వారా నివేదించారు.