ఎన్నికలు నిలిపివేయండి... లేదంటే బహిష్కరిస్తాం

* ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

(ఉద్యోగులు న్యూస్ ) 

 


రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమీషనర్ కి తెలిపమని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమీషనర్ కి సీఎస్ కు  వివరించారన్నారు. ఎన్నికల విధులు బహిష్కరిస్తామని, అవసరం అయితే కోర్ట్ లను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ, బీహార్ లో ఎన్నికల తరువాత కరోనా వ్యాపించిందన్నారు.
ఎన్నికల కమీషనర్ మొండిగా నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.
నోటిఫికేషన్ ని ఉపసంహరించుకోవాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ట్రయిల్  రన్ జరుగుతొందన్నారు. ఎన్నికలు పెడితే ప్రజలు కూడా కరోనా తో భయబ్రాంతులకు గురైయ్యే ప్రమాదం ఉందని,స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడలేదన్నారు..9లక్షల కు పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారని 
ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పిస్తుందా అని ప్రశ్నించారు కరోనాతో చాలామంది ఉద్యోగులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలన్నారు.