వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి... ఎన్ఈపీ 2020 విరమించుకోవాలి 

(ఉద్యోగులు న్యూస్ )

ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోఒంగోలు  కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం  నిరసన దీక్ష జరిగింది .  వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని   గత నలభై మూడు రోజులుగా దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో  ఈ   రిలే నిరాహార దీక్ష జరిగింది... ఈ దీక్షకు హాజరైన వారిని ఉద్దేశించి విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే నరేంద్ర మోదీ  ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తోందన్నారు.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సేకరించే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులకు అప్పగించే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ఏపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి వి సుబ్బారావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి విద్యా రంగంతో పాటు అన్ని రంగాలను ప్రైవేట్ పరం ఇస్తూ వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారని అందులో భాగంగానే విద్యారంగాన్ని హైందవి కరించి  ప్రైవేటీకరించెందుకు విద్యారంగంలో మార్పులు తీసుకు వస్తున్నారన్నారు.   కార్మిక కర్షక కార్మిక కర్షక,  విద్యార్థి , మేధావులు అందరూ కలిసి మోదీ  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు... ఈ కార్యక్రమంలో పౌరసమాజం జిల్లా కన్వీనర్ జి నరసింహారావు,ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ మోహన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం,  విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, ఏపిటిఎఫ్ 1938 సీనియర్ నాయకులు మద్దాలి రాఘవరావు,  ఏపిటిఎఫ్ 1938 జిల్లా అధ్యక్షులు జి వి వి కీర్తి, ఏపీటీఎఫ్  నాయకులు అమ్మయ్య, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా నాయకులు K.హనుమంతరావు,  పిడిఎస్ యూ  నాయకులు సురేష్,మహర్షి తదితరులు పాల్గొన్నారు.