20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం .. రెగ్యులర్ చేయించండి
(ఉద్యోగులు న్యూస్ )
డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగు
గత 20 ఏళ్లుగా సేవలందిస్తున్న డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామక్రిష్ణరెడ్డికి పారామెడికల్ ఎంప్లాయిస్ జెఏసి విజ్ఞప్తి చేసింది. రాయచోటి మండల పర్యటనలో భాగంగా బాలిరెడ్డిగారిపల్లెలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బసిరెడ్డి సిద్దారెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణరెడ్డి , రాష్ట్ర చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి శనివారం వచ్చిన సందర్భంగా జేఏసీ ఆకాంక్షను తెలిపింది. తమను రెగ్యులర్ చేయాలని ఎంప్లాయిస్ జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథ రెడ్డి, జిల్లా కన్వీనర్లు యస్.ఖాదర్ భాష,బి.రవిశంకర్ డి.రామచంద్ర,జి.రాజేంద్ర లు వినతిపత్రం అందజేశారు. . కరోనా ప్రంట్ లైన్ వారియర్స్ గా ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారామెడికల్ ఉద్యోగులైన మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (మగ) ,ఏయన్ యంలు,ల్యాబ్ టెక్నిషియన్లు, పార్మసిస్టులకు మేలు చేసేలా మంత్రి వర్గ ఉప సంఘం, ఆధికారుల నివేదికను త్వరితంగా తెప్పించుకోని వెంటనే రెగ్యులర్ చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామక్రిష్ణరెడ్డి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన వినతిపత్రం ఆదికారులకు పంపామన్నారు.