Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

సీపీఎస్ రద్దయ్యే వరకూ పోరాటం 

 

*ఏపీసిపిఎస్ సంఘం రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ 


 (ఉద్యోగులు న్యూస్ )


ఏపీసిపిఎస్ సంఘం రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా ఎన్నికైన  ఎస్ఆర్ వెంకట జనార్ధనరెడ్డికి  అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. ప్రొద్దుటూరు    శ్రీరాములపేట లోని సిపి ఎస్ సంఘ కార్యాలయంలో అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చాడా రామాముని రెడ్డి,విట్స్ మాథ్స్ ప్రొఫెషర్ బాల అంకిరెడ్డి తదితరులు చైర్మన్ ను సన్మానించారు. .కార్యక్రమంలో ఒంటేరు మాట్లాడుతూ ఏపీ సిపిఎస్ అధ్వర్యంలో  సిపియస్ రద్దు అవుతుందని  ఆకాక్షించారు.  ప్రొఫెసర్ డాక్టర్ చాడ రామునిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీ సిపిఎస్ ఈఏ నిర్మించిన సిపిఎస్ రద్దు ఉద్యమం దేశమంతా విస్తరించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మైన తామూ    ఉద్యమించామన్నారు.  డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి,  విట్స్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాల అంకిరెడ్డి  ప్రసంగించారు. ఎ వెంకట జనార్ధన రెడ్డి మాట్లాడుతూ సిపీఎస్ రద్దు చేయక పోతే మహోద్యమం తప్పదన్నారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు నాగ చంద్రుడు ముద్దునూరు మండల బాధ్యులు రిజ్వాన్ మైదుకూరు మండల అధ్యక్షుడు సాన వెంకటరమణయ్య దువ్వూరు మండల బాధ్యులు వల్ల ఈశ్వర్ తదితరులు వెంకట జనార్ధన్ రెడ్డి చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో గణిత ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, రాష్ట్ర భాష ఉపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కాల్ కొండయ్య, నేతాజీ సోషల్ క్లబ్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కటిక భాస్కరరావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కవి గజ్జల వెంకటేశ్వర్ రెడ్డి, సేల్స్ టాక్స్ గంగాధర్ భోగ గంగాధర్, సుమర్జి, వారధి మధు, గౌస్ పీర్, వెంకట రమణయ్య, చాంద్ భాషా, అల్లా బకాస్, తిప్పా వతి చంద్రశేఖర్, విజయ్ ఆనంద్, అంబటి మోహన్ రెడ్డి,పరమేశ్వర్,ఇస్మాయిల్ బాషా తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి