విపత్తు కన్నా ఎన్నికలే ముఖ్యమా? 

* మూడు నెలల తర్వాత నిర్వహించండి

* బొప్పరాజు వెంకటేశ్వర్లు 

( ఉద్యోగులు న్యూస్)

 

ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్ స్పందించిన తీరు ఆక్షేపనియమని
ఏపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల విషయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యోగులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారన్నారు. మాస్కులు, పీపీయి కిట్లు, శానిటైజర్ వాడిన డాక్టర్లు, నర్సులు,ఎంతోమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం ఎన్నికల కమిషనర్ గ్రహించాలన్నారు.
ఎన్నికలు కమిషనర్ చెప్పినట్లు మేము నడుచుకోవడానికి తాము సిద్ధంగా లేమని బొప్పరాజు స్పష్టం చేశారు.
 లక్ష 30వేల పోలింగ్ బుతుల్లో 10లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల నిర్వహణ వల్ల ఒకరు కూడా మరణించరని హామీ ఇస్తారా అని ఈసీని ప్రశ్నించారు. కోవిడ్ నియంత్రణ పోరులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. గత అనుభవాలు చూసి  ఎన్నికల విధుల్లో పాల్గొనమని ఎన్నికల కమిషనర్ ఎలా చెప్పగలుగుతోందన్నారు. ఎన్నికల కమిషనర్ ఎన్నికలను 3నెలలు వాయిదా వెయ్యాలనేది ఉద్యోగుల డిమాండ్ అన్నారు. వ్యాక్సిన్ వేసిన తరువాత ఉద్యోగులు  మానసికంగా ఎన్నికలకు సిద్ధమవుతారన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన కోడ్ సైతం వెనక్కు తీసుకొని విధుల్లో ఉద్యోగులు భాగస్వామ్యమయ్యారన్నారు. 
ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలతో పట్టింపులకు వెళ్ళకూడదన్నారు. ఎన్నికలను నిర్వహించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏమైనా ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. ఒక  కేసు మాత్రమే రాష్ర్టంలో  ఉందని ఎన్నికలను వెళదామని సీఎం చెప్తే ఎన్నికలకు నాడు ఎందుకు వెనకడుగు వేశారని ప్రశ్నించారు.
స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి  ఏపీలో ఉందని 
కరోన నియంత్రణ పోరులో  ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే
రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటి వరకు సహాయం చెయ్యాలేదన్నారు.
వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వేడుకుంటున్నాంమని చెప్పారు.
సబ్బం హరి నా కుమారుడి వివాహం  విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలని అశోక్ బాబు, బాబు రాజేంద్ర ప్రసాద్,సబ్బం హరి ఎన్నికలను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఉద్యోగుల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. త్వరలో గవర్నర్ ని కలిసి వినతి పత్రం అందిస్తామని 
ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగులపై విమర్శలు చేస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల కమీషన్ కు విపత్తు నివారణ ముఖ్యమా,ఎన్నికలు  నిర్వహణ ముఖ్యమా తేల్చుకోవాలన్నారు.
అశోక్ బాబును ఉద్యోగుల జోలికి  రావొద్దని హెచ్చరించారు. అనవసరంగా ఉద్యోగులపై అశోక్ బాబు విమర్శలు చేస్తే రోడ్డుపైకి లాగుతామని స్పష్టం చేశారు.

పోలీసు అధికారుల సంఘం ప్రతినిధి జనకుల శ్రీనివాస్ మాట్లాడుతూ 
పీపీయి కిట్లు కరోనా సోకకుండా అపలేవని ఎన్నికల కమిషన్ తెలుసుకోవాలన్నారు 
పోలీసు శాఖలో కరోనాతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని 
ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ మొండిగా ముందుకు వెళ్తే ఉద్యోగుల వల్ల కూడా కరోన సోకే  అవకాశం ఉందన్నారు.