స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్టు
*అంతకుముందు రిట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ జి ఎఫ్ చైర్మన్ వెంకట రామిరెడ్డి
*వైయస్సార్ టి ఎఫ్ అధ్యక్షుడు జాలి రెడ్డి
(ఉద్యోగులు న్యూస్)
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసింది ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. వ్యాక్సినేషన్ కూడా ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించింది. అంతకుముందు ఎన్నికలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు ఏపీజిఇఎఫ్ చైర్మన్ కే వెంకట రామి రెడ్డి, వైయస్సార్ టి ఎఫ్ అధ్యక్షుడు కే జాలి రెడ్డి తదితర నాయకులు లంచ్ మోషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిని కూడా స్వీకరించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసింది. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పంచాయతీ ఎన్నికలను జరపడానికి ఇది సమయం కాదని ప్రకటించిన విషయం విధితమే
ఈ తీర్పు ఉద్యోగుల ప్రజల విజయం
ఏపీ జి ఈఎఫ్ చైర్మన్ కే వెంకటరామిరెడ్డి
ఈ తీర్పు పట్ల ఏపీ జి ఈఎఫ్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఉద్యోగుల ప్రజల విజయమని అన్నారు. సోమవారం లంచ్ మోషన్ లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సానుకూలంగా తీర్పు చెప్పడం హర్షణీయమని అన్నారు.
ఇది ఉద్యోగ ఉపాధ్యాయుల విజయం
పి ఆర్ టి యు ఏపీ అధ్యక్ష కార్యదర్శులు
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్థానిక సంస్థల షెడ్యూలు ను హైకోర్టు సస్పెండ్ చేయడం ఉద్యోగ ఉపాధ్యాయుల విజయంగా పిఆర్టియు ఏపీ అధ్యక్ష కార్యదర్శులు గిరి ప్రసాద్, మల్లు శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.
హైకోర్టు తీర్పు హర్షణీయం
వైయస్సార్ టి ఎఫ్ అధ్యక్షులు జాలి రెడ్డి
స్థానిక సంస్థల షెడ్యూల్ హైకోర్టు సస్పెండ్ చేయడం హర్షణీయమని వై ఎస్ ఆర్ టి ఎఫ్ అధ్యక్షుడు జాలి రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతకుముందు హైకోర్టులో లంచ్ మోషన్ లో రిట్ పిటిషన్ దాఖలు చేయడం దానిని బెంచ్ గ్రాంట్ చేయడం కూడా జరిగిందని తెలిపారు