సీఎం సార్.. సిపిఎస్ రద్దు చేయండి

*  వెంకట జనార్ధన రెడ్డి

కడప కో-ఆపరేటివ్ కాలనీ లోని హ్యాపీ కిడ్స్ స్కూల్ నందు ఎపిసిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన వెంకట జనార్ధనరెడ్డినీ సంఘం జిల్లా మరియు నగర సభ్యులు ఘనంగా సన్మానించారు. సర్వ శిక్షా అభియాన్ పథక ఏఎస్ఓ కేశవ రెడ్డి, కడప ఎన్జీఓ సంఘం కార్యదర్శి వల్లేం సుబ్బారెడ్డి  చేతుల మీదుగా 2021 క్యాలెండర్ నీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఈసి స్థానిక సంస్థల ఎన్నికల నోటఫికేషన్ విడుదల చేసిన వెంటనే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏక కంఠంతో కండించి ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలిచాయని దీనికి ప్రతిగా సిపిఎస్ రద్దు చేసి ప్రభుత్వం ఉద్యోగుల పక్ష పాతి అని నిరూపించాలని కోరారు. కేశవ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాషా, కడప నగర మహిళా అధ్యక్షురాలు హైమవతి  సిపిఎస్ రద్దు ఉద్యోగుల కల అని సీఎం  నెరవేర్చాలని  కోరారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి రజనీ కాంత్,జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి తీగల చంద్రశేఖర రెడ్డి, నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు,కిషోర్,లోకేష్,ఫణీంద్ర, మనోగ్న,అమీరున్నిస,శివ శేషాద్రి రెడ్డి, డాక్టర్ శివరామ రెడ్డి,వెంకట రమణయ్య,శంకర్ రెడ్డి, రిజ్వన్ , మదన్ మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.