Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

సవరణల కోసం సలహాదారుడు  ముందు..

*జాక్టో ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలి.

*సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిసిన జాక్టో

ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, కు  సంబంధించిన ఉత్తర్వులు 53, 54 లలో సవరణలపై  ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి  జాక్టో నివేదించింది.   విద్యారంగ సమస్యలను  పరిష్కరించాలని కోరింది. ఉపాధ్యాయుల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని  నివేదించినట్లు  జాక్టో  చైర్మన్ కె.జాలిరెడ్డి, సెక్రటరీ జనరల్  యం.శ్రీధర్ రెడ్డి , తెలిపారు.

జాక్టో నివేదన మేరకు...

* 2019 జూలై ,అక్టోబరులో జరిగిన పండిట్, పి.ఈ.టి ల ఉన్నతీకరణ స్థానాలను, ఇతర పదోన్నతుల స్థానాలను బదిలీలలో ఖాళీలుగా చూపించాలి.

* బదిలీలు పూర్తయ్యేలోపు డిఈఓ పూల్ లో ఉన్న భాషాపండితులకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి పదోన్నతులు కల్పించాలి.

* ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానాన్ని కొనసాగించాలి.

* ఏడాదికో  పాయింట్ కేటాయిస్తూ, గరిష్టంగా 25 పాయింట్లను ఇవ్వాలి.

* సర్వీసు పాయింట్లకు తోడుగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో కేడర్ సీనియారిటీకి అదనంగా ఏడాదికో  పాయింటు చొప్పున కేటాయించాలి.

* 2018 డీఎస్సీలో నియమితులైన  ఉపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా చూపించి బదిలీల తరువాత వారికి స్థానాలను కేటాయించాలి.

* ప్రాథమిక పాఠశాలలో  విద్యార్థుల సంఖ్య 80 ఉంటే పీఎస్హెచ్ఎం పోస్టును ఎస్జీటీగా పరిగణించకూడదు.

*        ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కొనసాగించాలి. వారిని సర్ప్లస్ గా చూపకూడదు.

* 2020 సెప్టెంబరు 20 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్దీకరణ జరగాలి.

 * 50 సంవత్సరాలు పై బడిన స్పౌజ్ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులకు 3 పాయింట్లను అదనంగా కేటాయించాలి.

* సర్వీసు నిబంధనలు లేని కారణంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాలను కలిపి బదిలీలు నిర్వహించాలి.

* జీవో 223ను రద్దు చేసి పాఠశాల సహాయకులకు ప్రస్తుతము ఖాళీగా ఉన్న మరియు కొత్తగా ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలల్లోజూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులను కల్పించాలి.

*ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య 400 దాటితే రెండవ PD పోస్టును,  750 దాటితే మూడవ PD పోస్టును కేటాయించే ఉత్తర్వులను వెంటనే అమలుపరచాలి.

 

 జాక్టో చైర్మన్ కె.జాలిరెడ్డి ,సెక్రటరీ జనరల్ యం.శ్రీధర్ రెడ్డి , ఒంటేరు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయ సంఘనేతలు శ్రావణ్ కుమార్  ,ఎ.కొండయ్య , రామకృష్ణ, పిచ్చిరెడ్డి, రామాంజనేయులు, జమాల్ రెడ్డి  తదితరులు ప్రభుత్వ సలహదారుని కలిసినవారిలో ఉన్నారు.  విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురెష్పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, సంయుక్త సంచాలకులు దేవానందరెడ్డిలకు జాక్టో  తమ  ప్రతిపాదనలు నివేదించింది.

ఎక్కువ మందిచదివినవి