Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

11 మంది కడప పోలీసులకు అవార్డులు

కడప జిల్లాలో ప్రతిభావంతమైన సేవలు అందించిన 11 మంది పోలీసులకు డిస్క్ కమెండేషన్ అవార్డులను రాష్ర్ట డీజీపీ గౌతం సవాంగ్ శుక్రవారం అందించారు. అనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డులు వీరు తీసుకున్నారు. కడప ఏఎస్ఐ లు పి.రాంభూపాల్ రెడ్డి, కాటమరాజు, ప్రొద్దుటూరు ట్రాఫిక్ ఎస్ ఐ సుబ్బన్న,  వేంపల్లె ఏ ఎస్ ఐ రాచరాయుడు, కలసపాడు ఏ ఎస్ ఐ కె.నాగేంద్రనాథ్, కడప మహిళా కానిస్టేబుళ్లు జి.విజయలక్ష్మి, ఎస్ విజయబాయి తదితరులకు డీజీపీ అవార్డులు అందించారు.

ఎక్కువ మందిచదివినవి