Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఏం చేద్దాం?

*రాజమండ్రిలో పారా మెడికల్ సిబ్బంది భేటీ

*ప్రభుత్వ  ఉద్యోగుల సంఘంతో కలిసి వ్యూహరచన

*ప్రారంభమైన  వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశం

 

ఆంధ్రప్రదేశ్  పారా మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. నటరాజ్ థియేటర్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో వీరి సమావేశం ప్రారంభమైంది.  ఎన్నాళ్లగానో పెండింగులో  ఉన్న వీరి ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంలో భవిష్యత్తు వ్యూహం, జీతాలు సరిగా అందకపోవడం,  ప్రతి నెలా జీతం ఇవ్వడానికి  రకరకాల నిబంధనల పేరుతో ఇబ్బందులు  సృష్టిస్తున్న వైనంపై ఈ  సమావేశంలో వీరు చర్చించనున్నారు.   సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి . ఆస్కార రావు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్ష నేత  హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్థీకరిస్తానని చెప్పడంతో  ఏడాది న్నరగా ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూశారు. మంత్రి వర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసినా  అది పూర్తి కాలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. రాజమండ్రి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ సిద్ధమవుతుంది.

 

ఎక్కువ మందిచదివినవి