Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

డాక్టర్.. సెలవు చీటీ పీవోకు పంపండి

ఐటీడీఏ చింతూరు రంపచోడవరం పరిధిలోని పీ హెచ్ సి వైద్యాధికారులు సెలవు తీసుకోవాలంటే ముందుగా ఐటీడీఏ పీవో అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారి సూచనల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు దరఖాస్తులను అడిషనల్ డిఎంహెచ్ఓ లేదా డిప్యూటీ డిఎం హెచ్ వో ద్వారా సమర్పించాలని సూచించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన దృష్ట్యా బయోమెట్రిక్ ద్వారా వైద్య అధికారులు తమ హాజరు నమోదు చేయాలని పేర్కొన్నారు. సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులకు నిర్వహించే సామర్థ్య పరీక్ష ఈనెల 22వ తేదీన జరుగుతుందని, పరీక్ష ఆయా డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

ఎక్కువ మందిచదివినవి