Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

హెల్త్ కార్డుల రూపకల్పనకు కమిటీ

 

హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు ప్రైవేట్ సంస్థ నుంచి హెల్త్ కార్డు పొందడానికి నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు టీయన్జీస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎం.హుస్సేని తెలిపారు. పి.విజయ భాస్కర్,గాంధీ ఆస్పత్రి, ఉమర్ ఖాన్,ప్రభుత్వ ఛాతి ఆస్పత్రి జ్ఞానేంద్ర బాబు టీఎస్హెచ్ఎంహెచ్ఐడీసీ ఎస్. మురళి రాజ్,సి హ్ సి బార్కాస్, కమిటీ సభ్యులు గా నియమించినట్లు తెలిపారు. . ఈ కమిటీ 15 రోజుల్లోపు ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ తో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ జిల్లా 100 ఉద్యోగులకు అన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో అన్ని రోగాలకి పనిచేసే విధంగా హెల్త్ కార్డు రూపకల్పన చేసి తనకు సమర్పిస్తుందన్నారు. ఎస్.ఎం.హుస్సేని అధ్యక్షతన జరిగిన సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. కోశాధికారి జే.బాలరజ్, మాజీ కార్యదర్శి ప్రభాకర్, సభ్యులు నరేష్ కుమార్, జగన్ కుమార్, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి