Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

మౌఖిక హామీ వద్దు..

* స్పష్టం చేసిన ఇంజనీర్లు

* రెండో రోజు ఇంజనీర్ల నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ ఇంజనీర్లు నిరసన రెండోరోజు కొనసాగాయి. విజయవాడలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం లో భోజన విరామ సమయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో టి.ఎం.సి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి తో శుక్రవారం సాయంత్రం జరిగిన చర్చల్లో ఇంజనీర్ల పై చర్యలు ఉండవని మౌఖిక హామీ తప్ప రాతపూర్వకంగా ఇవ్వకపోవడంపై ఇంజనీర్ల జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ కి రాసిన లేఖలను ఉపసంహరించుకోవడం తమ పరిధిలో లేదని ముఖ్య కార్యదర్శి చెప్పడంతో తమ ఉద్యమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. పి ఎం సి లో జరిగిన నిరసన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ నాయుడు, పిఆర్ ఇంజనీర్స్ జనరల్ సెక్రటరీ కె ఎస్ రావు, డిప్లమా ఇంజనీర్ల సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి రవీంద్ర, సంయుక్త కార్యదర్శి శ్రీ రామరాజు పాల్గొన్నారు.