Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

తెనాలి తాలూకా యూనిట్ పరిధిలో  ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా కోరారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ని  కలిసి సమస్యల పై వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ముఖ్యమంత్రికి నివేదించాలన్నారు.
 సంఘ కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు తెనాలి మున్సిపాలిటీ పరిధిలో  నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనం ఇప్పించాలని  కోరారు. వారం రోజుల్లో  ఇప్పిస్తానని హామీ  ఇచ్చారని భాషా తెలిపారు. తెనాలి యూనిట్ అధ్యక్షులు రవి కుమార్, ప్రధాన కార్యదర్శి కమల, గౌరవాధ్యక్షుడు  అబ్దుల్లా తదితరులు ఎం ఎల్ ఏ కు సన్మానం చేసారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్, తెనాలి తాలూకా యూనిట్ అధ్యక్షులు రవి కుమార్, ప్రధాన కార్యదర్శి కమల, గౌరవ అధ్యక్షులు అబ్దుల్లా, దుగ్గిరాల తాలూకా యూనిట్  అధ్యక్షులు చంద్రమౌళి,  తెనాలి ఇరిగేషన్ సంఘ నాయకులు షబ్బీర్ గారు తదితరులు పాల్గొన్నారు.