Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

పంచాయతీరాజ్ డిప్లమాఇంజనీర్ల నిరసన

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్లుగా అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోనూ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ల కార్యాలయాల ముందు గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. విజయవాడలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయం ముందు జరిగిన నిరసనకు పంచాయతీ రాజ్ ఇంజినీర్ల జేఏసీ నాయకత్వం వహించింది. విజిలెన్స్, ఏసీబీ విచారణకు ఇచ్చిన ప్రభుత్వ మెమోను రద్దు పరచాలని ఇంజనీర్లు నినదించారు. తమ పట్ల కక్ష సాధింపు చర్యలు తగ్గదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు విచారణ పేరుతో తమపై కేసులు పెట్టవద్దని డిమాండ్ చేశారు. ఈ నిరసన మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఈనెల 18న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించామని అసోసియేషన్ చైర్మన్ మురళి కృష్ణ నాయుడు , సెక్రటరీ జనరల్ జి హనుమంతరావులు తెలిపారు.