Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా సిహెచ్ పాపారావు

 విశాఖపట్టణం ట్రాఫిక్ విభాగంలో ఏ ఎస్  పీ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ పాపారావు రాజమండ్రి అర్బన్ ఎస్పీగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పదోన్నతి పై నియమితులు కానున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ ట్రాఫిక్ డిఎస్పి ఎస్ వెంకట్రావు ఏఎస్పీగా పోలీసు ప్రధాన కార్యాలయానికి, అర్బన్ డిఎస్పీ పి సత్యనారాయణ రావు విజయనగరం ఎస్పీగా పదోన్నతుల పై బదిలీ కానున్నారుఈ మేరకు ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. రాజమహేంద్రవరం అర్బన్ స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి కె వి సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా దిశ మహిళ పోలీస్ స్టేషన్ కు, రాజమహేంద్రవరం అర్బన్ దిశా మహిళా స్టేషన్ ఒకటో డిఎస్పీగా  కె తిరుమలరావు నియమితులు కానున్నారు.

ఎక్కువ మందిచదివినవి