Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

రైల్వే లోకో పైలట్ల బ్లాక్ డే

 

(ఉద్యోగులు న్యూస్)

 దక్షిణ మధ్య రైల్వేలో లోకో పైలట్ల డిమాండ్లు తక్షణమే  నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని  లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్  చేసింది.  విజయవాడ, రాజమహేంద్రవరం, బిట్రగుంట రైల్వే క్రూ లాబీల్లో శుక్రవారం వీరు బ్లాక్ డే నిర్వహించారు. డీ ఏ, డీ ఆర్ లపై ఫ్రీజింగును తక్షణమే ఎత్తివేసి  బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి యూనియన్ కోరింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ రూ.50 లక్షల బీమాను  రైల్వే కార్మికులందరికీ వర్తింపజేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు వెంకటేశ్వర్లు, గురుమూర్తి, వెంకటేశన్ తదితరులు మాట్లాడారు.