Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ప్రభుత్వ ఉద్యోగులు గానే చూడండి

* మంత్రి పేర్నినాని కి ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ వినతి

పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలున్నింటిని వర్తించేయాలని రవాణామంత్రి పేర్నినానిని ఆర్టీసీ  ఎంప్లాయిస్ యూనియన్  కోరింది. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన గౌరవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో  ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం  చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సౌకర్యాలు, సర్వీసు నిబంధనలు  పిటిడి ఉద్యోగులకు అమలు చేయడంలేదన్నారు.  ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అద్యక్షులు వై.వి.రావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు  ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రిని శనివారం కలిశారు‌.

పిటిడి (ఆర్టీసి)ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే మాత్రం పాత ఆర్టీసి నిబంధనలను ఉపయోగిస్తూ అధికారులు  చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఏదైనా సౌకర్యాలు,రాయితీలు,ప్రమోషన్లు ఇవ్వాలంటే మాత్రం ప్రభుత్వం అనుమతి కావాలంటిన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కొరకు మరియు గతంలో జెఎసితో చేసుకున్న ఒప్పందాలు అమలు విషయంలో  చొరవ చూపించి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు,రిటైర్ అయిన ఉద్యోగులకు అందరికి న్యాయజరిగే చూడాలని  కోరారు. మంత్రి  ముందుంచిన ప్రధానమైన సమస్య లను ఆర్టీసి  యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది.

* తెలంగాణా ఆర్టీసితోఇంటర్ స్టేట్ ఒప్పందం వెంటనే జరిగేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి.

*గతంలో జెఏసి తో చేసుకున్న ఒప్పందం మేరకు 2017 వేతన సవరణ అరియర్సు మరియు పెండింగు ఉన్న లీవ్ ఎన్ క్యాస్ మెంట్లు చెల్లించాలి.

*ఆర్టీసీ  సిసిఎస్ కు మేనేజ్ మెంటు చెల్లించాల్సిన రూ. 253 కోట్లు అసలు,వడ్డి రూ.37 కోట్లు మొత్తం రూ. 290 కోట్లు సొసైటికి వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

*ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి ట్రస్టులను రద్దు చేసినందున ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి.

*పెండింగు ఉన్న కారుణ్య నియామాకాలు చేపట్టాలి, మెడికిల్ అన్ పిట్ అయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి సర్క్యులర్   ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి ఆకుటుంబాలను ఆదుకోవాలి.

* కోవిడ్ తో మరణించిన ఉద్యోగులందరికీ రూ. 50 లక్షలు భీమాసౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి.

* కోవిడ్ పోజిటివ్ వచ్చి ప్రైవేట్ ఆసుత్రులలో వైద్యం చేయించుకున్న ఆర్టీసి ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు  మెడికిల్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

* గతంలో జెఏసి తో చేసుకున్న ఒప్పందం మేరకు  సర్వీసులో ఉన్న ఉద్యోగి భార్యా భర్తలకు ఫ్రీ ట్రావెలింగ్ కార్డ్ ఇచ్చేలా చూడాలి.

* 2019 డిసెంబర్ 31 నాటికి  రెగ్యులేషన్లో ప్రమోషన్సు ఇచ్చిన వారందరినీ క్రమబద్దికరించి,2011 సిబ్బంది విధి విధానాలు ప్రకారం అప్పటి వరకు ఉన్న ఖాళీలలో ప్రమోషన్లు ఇచ్చేలా అర్హులందరికీ న్యాయం చేయాలి.

* 240 రోజులు పూర్తిచేసుకొని ఇంకా పెండింగ్ 140 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి.

* ప్రభుత్వఉద్యోగుల వర్తించే అన్ని సర్వీస్ రూల్స్ పిటిడి  ఉద్యోగులకు వర్తింపజేయాలి.

*  ఆంద్రప్రదేశ్ గవర్నమెంటు లైఫ్ ఇన్సురెన్సు స్కీమ్ ను పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు వర్తింపజేయాలి.

* పిడిటి(ఆర్టీసి)ఉద్యోగులకు గతంలోమాదిరిగానే వైద్య సౌకర్యాలు కల్పించాలి.

 * గత ప్రభుత్వం హయాంలో  ఆర్టీసీఉద్యోగుల వేతనాల సవరణ సందర్బంగా జరిగిన  సమ్మె లో ఉద్యోగులపై పెట్టిన పోలీసు కేసులు ఎత్తివేయాలి.