Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఆరోగ్య భద్రత చర్యలు సూన్యం

* ప్రజా రవాణాపై డీటీసీకి ఫిర్యాదు

బస్సులు లోపల కింద శానిటైజ్ చేయకుండా, సామాజిక దూరం పాటించకుండా బస్సులు తిరిగేస్తున్నాయని ప్రయాణికుల రవాణా ప్రమాదకర పరిస్థితుల్లో సాగుతోందని సోషల్ జస్టిస్ రైట్ ఫర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ గడియం వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. కోవిడ్-19 దృష్ట్యా కనీస భద్రతా చర్యలు పాటించకుండా సాగుతున్న ప్రజారవాణాపై ప్రకాశం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణిని కలిసి ఫిర్యాదు చేసారు. జిల్లాలో బస్సుల యొక్క కండీషన్లపై దృష్టి సారించాలని కోరారు. కనీస పరీక్షలు చేయకుండా బస్సులో అనుమతించటం దురదృష్టకరమన్నారు. ప్రాణాలు పోతున్న ఘటనలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించకుండా ప్రకాశం రీజియన్ ఏపిపిటిడి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీటీసీ చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారన్నారు. ఆర్గనైసేషన్ ప్రతినిధి పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి