Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

సంతోషం...సంబురం

* సింగరేణి ఉద్యోగులకు ఈ నెల 23న లాభాల బోనస్

* 19న పండగ అడ్వాన్స్ చెల్లింపు

* మార్చి నెలలో మినహాయించిన జీతామూ చెల్లింపు

 

సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు శుభవార్త. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సి.ఎం.డి శ్రీధర్ వరాలను ప్రకటించారు. లాభాల బోనస్ 28 శాతాన్ని ఈ నెల 23న చెల్లిస్తున్నట్లు రాష్ట్ర సిఎండి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2019 20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు రూ. 990 3.86 కోట్లు కాగా వాటిలో ఎనిమిది శాతం అంటే రూ 278. 28 కోట్లు సంస్థలోని ఉద్యోగులకు ఈ నెల 23న పంపిణీ చేయనున్నామన్నారు. సగటున ఒక్కో కార్మికునికి రూ. 60468లు బోనస్ అందే అవకాశం ఉందని సిఎండి పేర్కొన్నారు. కరోనా నే పథ్యంలో మార్చి 2020 జీతాల్లో మినహాయించిన మొత్తాన్ని లాభాల బోనస్ తో కలిపి 23న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు. ఏటా మాదిరి దసరా పండుగ అడ్వాన్సు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల చొప్పున ఈ నెల 19న ఉద్యోగుల ఖాతాల్లో చెల్లిస్తామని వివరించారు. కరోనా నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది మాదిరి లాభాల బోనస్ ను 28 శాతం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశించారని సింగరేణి కార్మికుల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సి.ఎం.డి శ్రీధర్ వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఏటా లాభాల బోనస్ శాతాన్ని ముఖ్యమంత్రి పెంచుతున్నారన్నారు. అంతకుముందు 2012-13 లో లాభాల వాటా 18 శాతం ఉండగా, ఏటా ఈ మొత్తాన్ని పెంచుతూ ఈ ఏడాది 28 శాతానికి చేరిందన్నారు.

ఎక్కువ మందిచదివినవి