Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఎస్ జీ టీ లకు ప్రమోషన్ల మాటేమిటి?

తెలంగాణ ఎస్ జీ టీ ఫోరం నేత ఖంరొద్దీన్ ప్రశ్న

 

(ఉద్యోగులు న్యూస్)

ఎస్ జీ టీ లు పదోన్నతులు లేక అలాగే రిటైర్ అవుతున్నారని తెలంగాణ ఎస్ జీ టీ ఫోరం రాష్ర్టశాఖ అధ్యక్షులు మొహమ్మద్ ఖంరొద్దీన్ అన్నారు. ఎస్ జీ టీ లు అన్ని రకాలుగా నష్టపోతున్నారని, ప్రతి పీ ఆర్సీ లోను తమకు అన్యాయం జరిగిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే పీ ఆర్ సీ లో ఎస్జీటీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఉపాధ్యాయ  ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని కూడా ఖంరొద్దీన్ కోరారు. ప్రతి  ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని పోస్టు ఏర్పాటు చేసి తమకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎక్కువ మందిచదివినవి