Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

నవంబర్ 30 లోగా మిస్సింగ్ క్రెడిట్స్ పంపాల్సిందే

రాష్ట్రంలోని సిపియస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్ ను విజయవాడ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి జీతాల చెల్లింపు అధికారులు నవంబర్ 30 లోగా పంపాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏపీ యుటిఎఫ్ అధ్యక్షుడు షేక్ సాబ్జీ, ప్రధాన కార్యదర్శి పి బాబు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన పెన్షన్ విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైందని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 2014 సెప్టెంబర్ 1 నుంచి 2004 జూన్ 2 వరకు సిపియస్ ఉద్యోగుల పని చేసిన స్థానాల్లో ఏవైనా మిస్సింగ్ రేట్స్ ఉంటే పంపాల్సిందిగా జీతాల చెల్లింపు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఉద్యోగి బదిలీ అయిన పదోన్నతి పొందిన డిప్యుటేషన్ మీద వెళ్ళిన ఆయన ఉద్యోగులు మిస్సింగ్ రైట్స్ బాధ్యత జీతాల చెల్లింపు అధికారుల దేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. పదేళ్లలో ఎటువంటి మిస్సింగ్ క్రెడిట్స్ లేనిపక్షంలో డి డి వో లు ఆ మేరకు ధ్రువపత్రాలు ఇవ్వాలన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ కోసం నవంబర్ 30వ తేదీలోగా నిర్దేశించిన ప్రొఫార్మా లో ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సిపిఎస్ ఖాతాల్లో సొమ్ము ప్రతీ ఎకౌంట్కి జమ చేయాల్సి ఉన్నందున డి డి వో లు బాధ్యతగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ సూచించారన్నారు.