Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

విద్యకు దూరం చేసే విధానాలపై పోరాటం

తెలంగాణ ఎస్సిఎస్టీ ఉపాధ్యాయ సంఘం ప్రైవేట్ యూనివర్సిటీ వల్ల ఏస్సే, ఎస్టీ బీసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఇందుకు వ్యతిరేకంగా పోరాటం చేయవాలని తెలంగాణ ఎస్సిఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం పిలుపునిచ్చింది . రాష్ట్ర అధ్యక్షులు శాగ కైలాసం అధ్యక్షత వెబినార్లో జరిగిన సమావేశం శనివారం జరిగింది. పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల విద్యార్థులు అందరికీ పాఠశాల ఆన్లైన్ ప్రారంభంమైన నాటి నుండి మధ్యాహ్న భోజనం బియ్యం ప్రతీ విద్యార్థి ఇంటికి అందజేయాలని, . రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదవడానికి అడ్డంగా ఉన్న మెమో 26559 రద్దు చేయాలని, ఎస్జీటీ నుంచి పీజీ చేయడానికి అవకాశం కల్పించాలని, తీర్మానించారు. ఇవి అమలు కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని సమావేశంలో నాయకులూ స్పష్టం చేశారు ప్రభుత్వ పాఠశాల లో స్కేవెంజర్ లను నియామకాలు చేసి నిధులు మంజూరు చేయాలని, పీఆర్సీ, ఐ ఆర్ ఇవ్వడంతోపాటు ప్రమోషన్ లు, బదలీ చేపట్టాలని . డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత రసమేష్, రాష్ట్ర నాయకులు సలాది సత్తయ్య, శాడా రవి,రాఘవులు, రవీందర్, హరిలాల్ ,మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి