Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

నవయుగ కవి చక్రవర్తి జాషువా

 

ఆధునిక కవులలో  గొప్ప స్థానం పొందిన  గుర్రం జాషువా రచనలు సామజిక ప్రయోజనాల కోసమేనని  రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ(ఎస్ఎల్టీఏ) గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి పేర అన్నారు. కవిత్వమనే ఆయుధంతో మూఢనమ్మకాలు ఎదురించారని ఛీత్కారాలు పొందినచోటే సత్కారాలు పొందిన నవయుగ కవిచక్రవర్తి ఆయనేనన్నారు. దళిత వర్గజ్వల కీర్తిగా పేరుగాంచారన్నారు. . ప్రొద్దుటూరు పట్టణం శ్రీరాములపేటలోని  ఉపాధ్యాయ సేవాకేంద్రం లో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆద్వర్యంలో  గుర్రం జాషువా  125 వ జయంతి వేడుకలు  ఘనంగా  నిర్బహించారు   ఈ కార్యక్రమం లో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య, ఎంటిఏ రాష్ట్ర కార్యదర్శి రామచంద్ర, కడపజిల్లా ఏపీసీపీఎస్ఈఏపీ అధ్యక్షుడు ఎస్వీ జనార్దన్ రెడ్డి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు మద్ధిలేటి, రిటైర్డ్  పీడీ ఓబుళరెడ్డి, కె. పురుషోత్తం ఆచారి  ఎస్. చంద్రుడు, పీ. రామచంద్ర ప్రసాద్  పీఐడియూ రాజు   నరసింహారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.