Tuesday 24th November 2020
ముఖ్యాంశాలు
  • విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్
  • బడులు తక్షణం తెరవాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ లోసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • సార్వత్రిక సమ్మె నాడు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు
  • ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా రవికుమార్
  • అఖిల భారత సమ్మెకు ఏపీ టి ఎఫ్(257)మద్దతు
  • జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిఉద్యోగుల సమస్యలపై చర్చించాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు

సర్వీసు అంతటికీ పాయింట్లు   ఇవ్వాలి

* ఫోర్టో డిమాండ్ 

(ఉద్యోగులు న్యూస్)

 అనంతపురం జిల్లా ఫోర్టో సమావేశం  ఉపాధ్యాయ భవన్లో సోమవారం జరిగింది.
బదిలీలలో సర్వీసు అంతటికి  పాయింట్లు కేటాయించాలని
 ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్స్( ఫోర్టో) చైర్మన్
కరణం హరికృష్ణ , జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎస్ నాగిరెడ్డి ఎస్ఎల్టిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గాండ్లపర్తి శివానందరెడ్డి వైఎస్ఆర్టిఎఫ్  రాష్ట్ర  వర్కింగ్ ప్రెసిడెంట్  అశోక్ కుమార్ రెడ్డి, ,ఫోర్టో నాయకులు ఆదిశేషయ్య ,వేణుగోపాల్ , వెంకటరమణప్ప, నరసింహారెడ్డి సలీం ,గోపాల్ రాష్ట్ర విద్యా శాఖ అధికారులను  కోరారు. చైల్డ్ ఇన్ఫో సరిచేయుటకు  అవకాశం ఇవ్వాలన్నారు.  బదిలీ దరఖాస్తుకు  మరికొంత సమయం ఇవ్వాలని కోరారు   స్టేషన్ సీనియారిటీకి సీలింగ్ ఉండకూడదన్నారు. మొత్తం సీనియార్టీ కి  పాయింట్లు కేటాయించాలన్నారు. ఖాళీలను  బ్లాక్ చేయొద్దన్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు సంవత్సరానికి ఒక పాయింట్ చొప్పున  సర్వీస్ కు కేటాయించాలని కోరారు. 50 సంవత్సరాలు దాటిన  భార్య భర్తల కేటగిరీ కాని  ఉపాధ్యాయులకు అదనంగా మూడు పాయింట్లు కేటాయించాలన్నారు. 20019 జూన్ నుండి జరిగిన పదోన్నతుల  ఖాళీలను చూపించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను యథావిధిగా కొనసాగించాలని కోరారు.