విద్యాశాఖాధికారుల వైఖరిపై ఎమ్మెల్సీల ఆగ్రహం

* ఉపాధ్యాయ సంఘాలు,  నాయకులతో ఇదే తీరు

* విద్యాశాఖ మంత్రితో ఏడుగురు ఎమ్మెల్సీల భేటీ

* తాజా అసంబధ్ధ  అంశాలపై చర్చలు

* ఫ్యాప్టో తో చర్చలు జరపడం డి

( ఉద్యోగులు న్యూస్ )

ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి   అసంబద్ధ  వైఖరి అనుసరిస్తున్నారంటూ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  విద్యాశాఖాధికారులు అనుసరిస్తున్న వైఖరిపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను ఏడుగురు ఎమ్మెల్సీలు బుధవారం  కలిశారు. బదిలీలు రేషన్ లైజేషన్  ప్రక్రియలో అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై మాట్లాడారు.  ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ  ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  ప్రధానంగా నాలుగు అయిదు అంశాలు మంత్రి ముందుంచామని, ఇంకా మాట్లాడుతున్నామని ఎమ్మెల్సీ  ఇళ్ల వెంకటేశ్వరరావు ‘ ఉద్యోగులు న్యూస్‘ కు చెప్పారు. తాజా ఇబ్బందులకు సంబంధించి ఫ్యాప్టో తో చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించాలని  కోరినట్లు చెప్పారు. విద్యామంత్రిని ఎమ్మెల్సీలు వెంకటేశ్వరరావు, కె.ఎస్. లక్ష్మణరావు, రాము సూర్యారావు, కత్తి నరసింహారెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం , యండవల్లి శ్రీనివాసులరెడ్డి, పాకలపాటి రఘువర్మ తదితరులు కలిశారు.

ఫ్యాప్టోతో చర్చలు జరపాలి...

ఫ్యాప్టోతో తాజా ఇబ్బందులకు సంబంధించి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీలు కోరారు.

* పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గడువు మరో రెండు రోజులు పెంచాలి.

*  ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్నింటినీ చూపాలి.

* సర్వీసు పాయింట్లపైనా  ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోవాలి.

* వెబ్ కౌన్సెలింగు కాకుండామాన్యవుల్ గా బదిలీలు నిర్వహించాలి.