Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

విద్యాధికారులు ×  ఉపాధ్యాయ సంఘాలు..

* వేడెక్కిన వాతావరణం

* ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదంటున్న సంఘాలు

* వ్యవహారం పీటముడి

( ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల మధ్య వాతావరణం గతంలో ఎన్నడూ లేని రీతిలో వేడెక్కింది. బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియలో వీరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. ఉపాద్యాయ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత,  ఆ చర్చల్లో సంఘాలు సూచించిన ఏ అంశానికి చోటు లేకుండానే ఉత్తర్వులు రావడంతోనే తొలుత ఉపాధ్యాయ సంఘాలు, నాయకులు హతాశులయ్యారు. అప్పట్లోనే ఏయే అంశాల్లో వారు విభేదిస్తున్నారో యూటీఎఫ్ నాయకులు, ఫ్యాప్టో నాయకులు చాలా స్పష్టంగా ఎప్పటికప్పడు కమిషనర్ కు ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్నారు. ఆ తర్వాత విద్యాశాఖ డైరక్టర్ తో వివిధ ఉపాధ్యాయ సంఘాలు చర్చలు జరిపాయి. ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, వాటిని సవరించకపోతే తలెత్తే ఇబ్బందులు ఏమిటి అనేది వివరంగా చెబుతూ  వచ్చారు. లేఖల రూపంలోను వివరిస్తూ వచ్చారు. చివరికి విద్యాశాఖ డైరక్టర్ ఫ్యాప్టో డిమాండ్ల విషయంలో లేఖ రాస్తూ ఏ డిమాండ్ విషయంలో తాము ఎలా నిర్ణయం తీసుకున్నారో వివరిస్తూ లేఖ రాశారు. తిరిగి ప్రతి అంశంలోను ఫ్యాప్టో తన వైఖరి, విద్యాశాఖ డైరక్టర్ ఏం చెబుతున్నారు, అందులో ఏం ఇబ్బందులు ఉన్నాయో సవివరమైన లేఖ పంపారు. అంతే కాకుండా 21న రాష్ర్ట వ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ఎదుట పికెటింగ్ కు పిలుపు ఇచ్చారు. అయితే ఈ విషయంలో సరైన గడువు లేకుండా పికెటింగ్ నోటీసు ఎలా ఇస్తారంటూ విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు నిలదీసినట్లు తెలిసింది. 15 రోజలు గడువు లేకుండా పికెటింగు చేస్తే నాయకులను సైతం సస్పెండ్ చేస్తానని ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించడంతో వివాదం మరింత రాజుకుంది. ఎప్పటి నుంచో లేఖలు రూపంలో, చర్చల రూపంలో సమస్యలు  చెబుతూ వస్తున్నా పట్టించుకోని అధికారులు చివర్లో రూల్సు మాట్లాడటం ఏమిటి అని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలలుగా చెబుతూ వస్తున్న విషయాలు పట్టించుకోకుండా నోటీసు విషయంలోను, లీగల్ గా ఎదురయ్యే  అంశాలు పేర్కొంటూ ఒక అధికారి హెచ్చరికలు జారీ చేయడంతో   వివాదం మరింత ముదిరినట్లయింది. ఏడుగురు ఎమ్మెల్సీలు బుధవారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను కలిసి ఉపాధ్యాయ సంఘాలపై విద్యాశాఖాధికారి  వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకుముందు చాలా మంది అధికారులను చూశామని, ఇలాంటి పరిస్థితులు ఎప్పడూ లేవని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.