Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

కరోనా వచ్చిన ఉపాధ్యాయులకు 14 రోజలు ఓడీ ఇవ్వాలి

*ఏపీటీఎఫ్ నాయకులు హృదయరాజు, వెంకటేశ్వరరావుల డిమాండ్


(ఉద్యోగులు న్యూస్) 

నవంబర్ 2 నుండి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు వెళ్తున్న సందర్భంలో రెండు నెలలకు కేవలం  రెండున్నర  రోజుల క్యాజువల్ లీవు మాత్రమే ఇవ్వడం ఏమిటని  ఏపీటీఎఫ్ నాయకులు హృదయరాజు, వెంకటేశ్వరరావులు విమర్శించారు.  కరోనా వచ్చిన వారికి 14 రోజుల ఓడీ సౌకర్యం కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కరోనా వస్తే మెడికల్ లీవ్ పెట్టుకోవాలని ఉత్తర్వు జారీ చేయడం డైరెక్టర్ నిరంకుశమైన చర్య అని , వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని  వారు డిమాండ్ చేశారు.