పీఆర్సీ అమలు వేగవంతం చేయాలి

* పి ఆర్ టి యు ఏపీ  నేతల విజ్ఞప్తి

(ఉద్యోగులు న్యూస్)

సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పదకొండో  పీ ఆర్సి అమలు వేగవంతం చేయాలని పి ఆర్ టి యు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి వైష్ణవి  కరుణానిధి మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రభుత్వప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సంబంధించి కోర్టులో ఉన్న స్టే   ఎత్తి వేయించాలన్నారు. ఖాళీగా ఉన్న డీవైఓఓ, డీఎడ్ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రతి మండలానికి ఒక ఉన్నత పాఠశాలను కళాశాలగా అప్గ్రేడ్ చేస్తున్నందున అర్హులైన స్కూల్ అసిస్టెంట్ లకు  జూనియర్ లెక్చరర్ గా పదోన్నతి ఇవ్వాలని పేర్కొన్నారు. కేజీబీవీ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ అమలుచేయాలని, ప్రభుత్వ  ఉపాధ్యాయినిలకు  ఇచ్చినట్లే కేజీబీవీలో ఉపాధ్యాయులకు 5 ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలన్నారు.  మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, ఇతర ఉపాధ్యాయుల మాదిరి పిఎఫ్, ఏపీజిఎల్ఐ, జిఐఎస్ లను ప్రతి నెల  వేతనాల నుండి మినహాయించాలని కోరారు. పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఉపాధ్యాయులకు ఈ హెచ్ ఎస్ సౌకర్యo అమలు చేయాలని లేఖలో కోరారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన ముంపు మండలాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, మెడికల్ రీఎంబర్స్మెంట్ గడువును పెంచాలని పిఆర్టియు నేతలు కోరారు