ఐఈఆర్టిలనుసీనియారిటీ ప్రకారం సర్దుబాటు చేయాలి

* బహుజన టీచర్స్ ఫెడరేషన్  వినతి 

(ఉద్యోగులు న్యూస్)  

కర్నూలు జిల్లాలోని మండల భవిత కేంద్రాలలో పనిచేయుచున్న ఐ.ఈ.ఆర్.టి లకు సీనియారిటీ ప్రకారం సర్దుబాటు చేయాలని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ కో-ఆర్డినటర్ వేణుగోపాల్ కు  బహుజన టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్) వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. . . డిసెంబర్ 2018 లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు భవిత సెంటర్లలో ఒక ఎంఆర్ఐ.ఈ.ఆర్.టి, హెచ్ఐ  ఐ.ఈ.ఆర్.టి ఉండే విధంగా అన్ని మండలాల్లో సర్దుబాటు చేయాలనే ఆదేశాలు బేఖాతరు చేస్తూ అప్పటి ఏ.పి.సి గా ఉన్న తిలక్ విద్యాసాగర్  గారు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్షపాతం చూపుతూ తనకు అనుకూలమైన వారికి మాత్రమే  సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చారని బిటిఎఫ్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్య నిబంధనలకు లోబడి ఉందని భావించి నేడు ప్రస్తుత ఏ.పి.సి వేణుగోపాల్ గారిని కలిసి జరిగిన తప్పిదాలను పునః పరిశీలించి వీలైనంత త్వరగా జరిగిన తప్పిదాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సీనియర్లుగా ఉన్న ఐ.ఈ.ఆర్.టి లకు సీనియారిటీ ప్రకారం సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిటిఎఫ్ నేతలు సతీష్ కుమార్, చెన్నయ్య, రాజశేఖర్, ఐ.ఈ.ఆర్.టి లు పాల్గొన్నారు.